- ప్రతీ ప్రభుత్వ ఉద్యోగికీ సంవత్సరానికి 15 యాదృచ్చిక సెలవులు (CL) ఉంటాయి. (G.O.Ms.No.52, GAD(Poll.B) Dept., Dt.04.02.81)
- ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో చేరినా, పదవీ విరమణ పొందుతున్నా, తగు నిష్పత్తిలో యాదృచ్చిక సెలవులు (CL) జమ చేయబడతాయి.
- ప్రత్యేకంగా చెప్పబడితే తప్ప కార్యాలయ అధికారి, తన కార్యాలయం లో పని చేసే సిబ్బందికి సెలవు మంజూరు చేసే అధికారాన్ని కలిగి ఉంటారు. కార్యాలయ అధికారి తన పై అధికారి నుండి మంజూరు చెయిన్చుకొనవలెను.
- సెలవు అనేది ప్రభుత్వ ఉద్యోగులు హక్కుగా పొందలేరు. ముందస్తు అనుమతి తో మాత్రమే ఉపయోగించుకోవాలి. అత్యవసర పరిస్థితులలో ముందస్తుగా అనుమతి పొందలేకపోతే, తగు కారణాలు వివరిస్తూ సెలవు మంజూరు చేయించుకోవలసి ఉంటుంది. ( G.O.Ms.No.999, Fin.,Dt.30.05.1959).
- అవసరమైన పరిస్థితులలో మాత్రమే సెలవు వినియోగించుకోవాలి. అలాగే తగు కారణాలు ఉంటె తప్ప సాధారణంగా సెలవు తిరస్కరించకూడదు.
- మంజూరు చేసిన సెలవుని ఏదైనా సందర్భంలో ఉద్యోగి విధులకు హాజరు కావడం తప్పనిసరి అయితే పూర్తిగా లేదా పాక్షికంగా రద్దు చేస్తూ విధులకు హాజరు కావాల్సిందిగా అదేశించవచ్చు.
- సెలవు కాలంలో ఉద్యోగి తన ప్రధాన కార్య స్థానాన్ని వదిలి వెళ్ళాల్సి ఉన్నట్లయితే అందుకు అనుమతి పొందవలసి ఉంటుంది. సెలవు సమయంలో ఉద్యోగిని సంప్రదించడానికి చిరునామా తెలియ పరచవలసి ఉంటుంది.
- తాత్కాలిక ఉద్యోగులకు మంజూరు చేయడం అనేది మంజూరు చేసే అధికారి విచక్షణ పై ఆధార పది ఉంటుంది.
- యాదృచ్చిక సెలవులను (CL), ఐచ్చిక సెలవుల తో (OH) తో, పబ్లిక్ హాలిడేస్ తో కలిపి వాడుకొనవచ్చును. ఇతర సెలవుతో కలిపి వాడుకునే అవకాశం లేదు.
- సగం రోజు సెలవు కూడా వినియోగించుకోవచ్చు.
- ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 02:00 వరకు లేదా
- మధ్యాహ్నం 02:00 నుండి సాయంత్రం 05:00 వరకు
- ముందస్తు అనుమతి లేని ప్రతీ మూడు అలస్యపు హాజరు కి ఒక యాదృచ్చిక సెలవు తగ్గించబడుతుంది.
- ముందస్తు అనుమతి తో ఒకే నెలలో మూడు సార్లు అలస్యపు హాజరుకి ఒక యాదృచ్చిక సెలవు తగ్గించబడుతుంది.
- ఒకేసారి మొత్తం పది రోజులకు మించి (పబ్లిక్ హాలిడేస్, ఆప్షనల్ హాలిడేస్ తో కలిపి) ఒక యాదృచ్చిక సెలవులు వాడుకోవడానికి అవకాశం లేదు. ఒకవేళ పది రోజుల కు మించితే వాటిని EL, HPL, EOL వంటి సెలవులుగా మంజూరు చేయవలసి ఉంటుంది.
- ఒక సంవత్సరంలో మిగిలిన సెలవులు తదుపరి సంవత్సరానికి బదిలీ చేయబడవు.
- ప్రతీ కార్యాలయంలో CL, OH, CCL ల నిర్వహణ కు వాచ్ రిజిస్టర్ నిర్వహించవలెను.
నమస్కారం సర్, CL పబ్లిక్ హాలిడేస్, SUNDAYS మధ్యలో పెడితే, CL MATHRAME, కౌంట్ తగ్గుతుందా, లేక హాలిడే స్, కూడా CL గా కౌంట్ అవుతాయా?
రిప్లయితొలగించండి