- ఈ నియమాలు జివో ఎంఎస్ నెం.84, తేదీ.24.02.2010 ద్వారా అమలులోకి వచ్చాయి.
- వీటిని ఆంధ్ర ప్రదేశ్ పంచాయితీ రాజ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్,2010 గా పిలుస్తారు.
- క్లాస్ -ఎ: పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ 1 నుండి 6
- క్లాసు-బి: సానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 1 & 2, హెల్త్ అసిస్టెంట్, మెటేర్నిటి అసిస్టెంట్, సానిటరీ మేస్త్రీ, ఫీల్డ్ అసిస్టెంట్
- క్లాస్- సి: పైప్ లైన్ ఫైన్ ఫిట్టర్, పంప్ డ్రైవర్ & ఆపరేటర్, ఎలక్ట్రీషియన్, లైటింగ్ సూపరింటెండెంట్/ ఇన్స్పెక్టర్, ఎలక్ట్రీషియన్ & ఫిట్టర్, లైన్ మెన్
- క్లాస్ - డి: లైబ్రరీ అటెండర్, రేడియో ఆపరేటర్, టౌన్ ప్లానింగ్ సర్వేయర్
- నియామక విధానం మరియు నియామక అధికారుల కొరకి క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ లోని రూల్ 22 ప్రకారం రిజర్వేషన్లు వరిస్తాయి.
- విద్యార్హతల కొరకు క్లిక్ చేయండి.
- ఏదైనా ప్రత్యేకంగా చెప్పబడితే తప్ప ప్రత్యక్ష నియామకాలకు గరిష్ట వయో పరిమితి ౩4 సంవత్సరాలు.
- పదోన్నతులు లేదా బదిలీ ద్వారా నియామకం పొందటానికి దిగువ పోస్టులో ప్రొబేషన్ పూర్తీ చేసి కనీసం మూడు సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి.
- ప్రత్యక్ష నియామకం పొందిన ప్రత్యీ ఉద్యోగి తప్పనిసరిగా వరుసగా మూడు సంవత్సరాల కాలంలో రెండేళ్ళ ప్రొబేషన్ కాలాన్ని పూర్తీ చేయాలి.
- పదోన్నతులు లేదా బదిలీ ద్వారా నియామకం పొందిన వారు వరుసగా రెండేళ్ళ కాలంలో ఒక సంవత్సరం ప్రొబేషన్ కాలాన్ని పూర్తీ చేయాలి.
- పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ 5, 6 పోస్టులకు ప్రత్యక్ష నియామకం ద్వారా ఎంపిక అయిన వారు ప్రొబేషన్ లో ఉండగా రూ.15,000/- కన్సాలిడేటెడ్ పే చెల్లించబడును. సంతృప్తికరం గా ప్రొబేషన్ పూర్తి అయిన తరువాత రెగ్యులర్ స్కేల్ ఇవ్వబడును.
- పంచాయితీ సెక్రెటరీ పోస్టుకి నియమించబడిన ప్రతీ ఉద్యోగి ప్రభుత్వం సమయనుగుణం గా నిర్దేసించిన ట్రైనింగ్ ని పూర్తీ చేయాలి. ట్రైనింగ్ వెళ్ళే ముందు విధిగా కనీసం మూడేళ్ళు సర్వీస్ చేస్తానని బాండ్ రాసి ఇవ్వాలి.
- ట్రైనింగ్ పూర్తీ అయిన పిదప మూడేళ్ళు సర్వీస్ చేయకపోయినా , ట్రైనింగ్ విజయవంతంగా పూర్తీ చేసుకోకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం లో తప్ప ఇంకెక్కడైనా ఉపాధి పొందినా ట్రైనింగ్ కాలంలో పొందిన జీతం, ఇతర అలవెన్సులు, ట్రైనింగ్ కొరకు ప్రభుత్వం వెచ్చించిన మొత్తం తిరిగి ప్రభుత్వానికి జమ చేయాలి.
- ట్రైనింగ్ పీరియడ్ ఇంక్రిమెంట్లకు, ప్రొబేషన్, లీవ్ మరియు పెన్షన్ కి పరిగణించబడును.
- ట్రైనింగ్ పీరియడ్ లో సాధారణ జీత భత్యాలు చెల్లించబడును.
- ప్రొబేషన్ కాలంలో ఉండగా పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ 5 & 6 తప్పనిసరిగా 146, 148 డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ కావలి.
- ప్రొబేషన్ కాలంలో ఉండగా పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ 5 తప్పనిసరిగా కంప్యూటర్ ప్రోఫిషియేన్సీ టెస్టు పాస్ కావలి.
- పంచాయితీ సెక్రటరీ గ్రేడ్ 1,2 లకు నియామక పరిధి జోన్, మిగిలిన అన్ని పోస్టులకు జిల్లా
- పంచాయితీ సెక్రటరీ గ్రేడ్ 1,2 లకు బదిలీ చేసే అధికారం పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమీషనర్ గారికి ఉంది. పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ 3 నుండి 6 వరకు బదిలీ చేసే అధికారం జిల్లా కలెక్టర్ గారికి ఉంది.
- పంచాయితీ సెక్రటరీ గ్రేడ్ 1,2 లపై క్రమ శిక్షణా చర్యలు తీసుకునే అధికారం పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ కమీషనర్ గారికి ఉంది. పంచాయితీ సెక్రెటరీ గ్రేడ్ 3 నుండి 6 లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్ గారికి ఉంది.
1, ఆగస్టు 2021, ఆదివారం
పంచాయితీ రాజ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి