- తాత్కాలిక మరియు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఈ సెలవు పొందటానికి అర్హులు
- తాత్కాలిక ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా (జనవరి & జూలై) 8 రోజులు జమ చేయబడతాయి.
- శాశ్వత ఉద్యోగులకు ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా (జనవరి & జూలై) 15 రోజులు జమ చేయబడతాయి.
- వెకేషన్ డిపార్టుమెంటు లలో పని చేసే వారికి ప్రతీ ఆరు నెలలకు అడ్వాన్సుగా 3 రోజులు జమ చేయబడతాయి.
- ఈ లీవ్ జమ చేయడానికి రోజులు ఉన్న నెలల్ని వదలి పెట్టి పూర్తీ గా సర్వీస్ చేసిన నెలలను పరిగణన లోకి తీసుకుంటారు.
- ఒక ఉద్యోగి సంవత్సరం మధ్యలో చేరినట్లయితే మొదటి రెండు నెలలకు ఒక్కొక్క రోజు, ప్రతీ మూడవ నెలకు రెండు రోజులు జమ చేస్తారు, ఉదాహరణకు ఒక ఉద్యోగి ఫిబ్రవరి 12 వ తేదీన తాత్కాలిక ప్రాతిపదికన చేరితే
- ఫిబ్రవరి కి "0"
- మార్చి కి ఒక రోజు
- ఏప్రిల్ కి ఒక రోజు
- మే కి రెండు రోజులు
- జూన్ కి ఒక రోజు చొప్పున మొత్తం ఐదు రోజులు అడ్వాన్సుగా జమ చేస్తారు
- ఎవరైనా ఉద్యోగి కొంత కాలం జీత నష్టపు సెలవు (EOL) లో ఉన్నట్లయితే తదుపరి అర్ధ సంవత్సరానికి ఎంతకాలం EOL లో ఉంటె అందులో పదో వంతు EL తగ్గించాలి (గరిష్టంగా సస్వాట్ ఉద్యోగులకు 15, తాత్కాలిక ఉద్యోగులకు 8 రోజులు తగ్గించాలి)
- ఉదాహరణకు ఒక ఉద్యోగి జూలై నుండి డిసెంబర్ మధ్యలో 67 రోజులు EOL లో ఉన్నట్లయితే తదుపరి జనవరి నెలలో జమ చేసే 15 రోజులలో 7 రోజులు తగ్గించి 8 రోజులు జమ చేయాలి.
- గరిష్టంగా నిల్వ ఉండే సంపాదిత సెలవు ౩00 రోజులు (16.09.2005 నుండి)
- 01.06.1964 నుండి 30.06.1983 గరిష్ట నిల్వ పరిధి 180 రోజులు
- 01.07.1983 నుండి 15.09.2005 మధ్యలో గరిష్ట నిల్వ పరిధి 240 రోజులు
- వైద్య కారణాలపై లేదా వ్యక్తిగత కారణాలతో ఒకేసారి గరిష్టంగా ఆరు నెలలు దాటకుండా ఉపయోగించుకోవచ్చు. (నాల్గవ తరగతి ఉద్యోగులు అయితే 120 రోజులు)
- CL మినహా ఇతర లీవులతో కలిపి ఉపయోగించుకోవచ్చు.
- పబ్లిక్ హాలిడే, ఆప్షనల్ హాలిడే, CCL లని సఫిక్స్ లేదా ప్రిఫిక్స్ గా ఉపయోగించుకోవచ్చు.
- ఆరు నెలల వరకు అన్ని రకాల అలవెన్సులు తో పూర్తి జీతం పొందవచ్చు. ఆరు నెలల తరువాత HRA, CCA చెల్లించారు.
- నిల్వ ఉన్నా సంపాదిత సెలవు ని సరెండర్ చేసుకుని దానికి సమానమైన నగదు పొందవచ్చు.
- 15 రోజులు సరెండర్ చేసుకోవడానికి 12 నెలల విరామం, 30 రోజులు సరెండర్ చేసుకోవడానికి 24 నెలల విరామం అవసరం.
- సంపాదిత సెలవు నిల్వ కనుక 285 రోజుల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే 12 నెలల గ్యాప్ లేకపోయినా 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చు.
- ఒక ఆర్ధిక సంవత్సరంలో ఒకేసారి ఈ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు.
- తాత్కాలిక ఉద్యోగులు కూడా 24 నెలల విరామం తరువాత 15 రోజులు సరెండర్ చేసుకోవచ్చు.
- మంజూరు ఉత్తర్వులు మంజూరు చేసిన తేదీ నుండి 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతాయి.
- పదవీ విరమణ పొందినపుడు లేదా సర్వీస్ లో ఉండగా చనిపోయినా ఉద్యోగి సంపాదిత ఖాతాలో ఉన్న నిల్వలు సమానమైన మొత్తాన్ని నగదు గా చెల్లిస్తారు (గరిష్టంగా ౩00 రోజులు)
- ప్రభుత్వ క్వార్టర్ల లో ఉండేవారికి HRA చెల్లించవచ్చు.
- కన్వేయన్స్ అలవెన్సు, IR లు చెల్లించబడవు.
- తాత్కాలిక ఉద్యోగులుగా చేరిన వారి సర్వీస్ రెగ్యులరైజ్ అయ్యాక లీవులను రీకాస్ట్ చెయ్యాలి
30, జులై 2021, శుక్రవారం
సంపాదిత సెలవు (earned leave)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి