30, జులై 2021, శుక్రవారం

అర్థ వేతనపు సెలవులు (Half Pay leave)

  • ప్రతీ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగికి ఒక సంవత్సర కాలం సర్వీస్ పూర్తీ చేసిన తరువాత 20 అర్ధ వేతన సెలవులు అతని సెలవు ఖాతాకు జమ చేయబడతాయి. డ్యూటీ, సెలవు, EOL లో ఉన్నప్పటికీ ఇవి జమ అవుతాయి. దీనికి గరిష్ట పరిమితి లేదు.
  • వైద్య కారణాలపై మరియు వ్యక్తిగత కారణాలపై ఈ సెలవుని వాడుకొన వచ్చును. గరిష్ట పరిమితి లేదు. 
  • ఆరు నెలల వరకు సగం బేసిక్ పే, DA మరియు పూర్తి HRA, CCA ఇవ్వబడుతుంది. 6 నెలల తరువాత HRA, CCA ఇవ్వబడదు.
  • కుష్ఠు, గుండె, క్షయ, కేన్సర్, మానసిక, కిడ్నీ, ఎయిడ్స్ వ్యాధులతో బాధపడేవారికి పూర్తి జీతం తో ఎనిమిది నెలల పాటు ఈ సెలవు మంజూరు చేస్తారు. 
  • పదవీ విరమణ సందర్భంగా ఉద్యోగుల సంపాదిత సెలవు నిల్వ 300 రోజుల కన్నా తక్కువ ఉన్నట్లయితే ఎంత తక్కువ ఉంటె అన్ని రోజులు అర్ధ వేతన సెలవు ని నగదు గా చెల్లించవచ్చు
    • (హాఫ్ పే + హాఫ్ డిఎ)/30 * నగదుగా చెల్లించవలసిన రోజులు.

కమ్యూటెడ్ సెలవు

  • వైద్య కారణాలపై కమ్యూటెడ్ సెలవు మంజూరు చేయవచ్చును.
  • మొత్తం సర్వీస్ లో గరిష్టంగా 240 రోజులు మంజూరు చేయవచ్చును. 
  • మంజూరు చేయబడిన కమ్యూటెడ్ సెలవు కు రెట్టింపు అర్ధ వెతనపు సెలవులు తగ్గించావలెను.
  • కమ్యూటెడ్ సెలవు కి పూర్తి వేతనం మరియు అలవెన్సులు చెల్లించ వచ్చును.
  • సంపాదిత సెలవు మరియు అర్ధ వెతనపు సెలవు కలిపి గరిష్టంగా 180 రోజులు మంజూరు చేయవచ్చును.
  • కమ్యూటెడ్ సెలవు అనంతరం ఉద్యోగి తిరిగి విధులకు హాజరు అవుతాడని విశ్వసించి నపుడు మాత్రమే ఈ సెలవు మంజూరు చేయవలెను. ఎవరైనా ఉద్యోగి తిరిగి విధులకు తిరిగి రిపోర్ట్ చేయకుండా రిటైర్ అయినట్లయితే లేక రిజైన్ చేసినా కమ్యుటెడ్ సెలవు ను హాఫ్ పే లీవ్ గా మార్చి అధికంగా చెల్లించిన జీత భత్యాలను రికవరీ చెయ్యాలి. 

1 కామెంట్‌:

  1. ప్రతీ రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగికి ఒక సంవత్సర కాలం సర్వీస్ పూర్తీ చేసిన తరువాత 20 అర్ధ వేతన సెలవులు అతని సెలవు ఖాతాకు జమ చేయబడతాయి ANTUNNARU......ANTEY SACHIVALAYAM EMPLOYEESS PROBATION COMPLETE CHESUKONI THARUVTHA 1 YEAR FULL PAY THO WORK CHETHEY KANI ELIGIBLE KARA SIR? LEKA VALLU ALREADY REGULAR KABATTI PROBATION COMPLETE THARUVATHA VENTANEY E LEAVES APPLY AVUTHAYA?

    రిప్లయితొలగించండి