ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీస్ (సిసిఎ) రూల్స్ ప్రకారం అభియోగాలు రుజువైన ఉద్యోగులపై రూల్ 9 ప్రకారం దిగువ పేర్కొన బడిన పెనాల్టీలు క్రమశిక్షణాధికారి విధించవచ్చును.
మైనర్ పెనాల్టీలు
- అభిశంసన (censure)
- పదోన్నతిని నిలుపుదల చేయడం
- ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయడం (without cumulative effect)
- సస్పెన్షన్ ని పెనాల్టీ గా పరిగణించడం
- గరిష్టంగా మూడేళ్ళ పాటు బేసిక్ పే ని దిగువ స్థాయికి తగ్గించడం (without cumulative effect)
మేజర్ పెనాల్టీలు
- ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయడం (with cumulative effect)
- బేసిక్ పే ని దిగువ స్థాయికి తగ్గించడం
- టైం స్కేల్, గ్రేడ్ పోస్ట్ స్థాయిలను తగ్గించడం
- నిర్బంధ పదవీ విరమణ
- రిమూవల్
- డిస్మిస్సల్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి