- తాత్కాలిక మరియు శాశ్వత ఉద్యోగులందరికీ వర్తిస్తుంది.
- గరిష్టంగా ఐదేళ్ళు ఉపయోగించుకొనవచ్చును
- వ్యక్తిగత మరియు వైద్య కారణాలపై ఉపయోగించుకొనవచ్చును.
- అసాధారణ సెలవు కాలానికి ఎటువంటి వేతనం చెల్లించబడదు.
- వైద్య కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు, పెన్షన్ కొరకు పరిగణించ బడుతుంది.
- వ్యక్తిగత కారణాలపై ఈ సెలవు ఉపయోగించుకొన్నచో ఇంక్రిమెంట్ లకు పరిగణించ బడదు. పెన్షన్ కొరకు గరిష్టంగా మూడేళ్ళ వరకు పరిగణించబడుతుంది.
- ఎన్ని రోజులు అసాధారణ సెలవులో ఉంటె అందులో 10 వ వంతు సంపాదిత సెలవు తగ్గించ బడుతుంది.
- ఏ ఇతర సెలవులు అందుబాటులో లేకపోతె ఈ సెలవు ఉపయోగించుకొనవచ్చును. ఇతర సెలవులు ఉన్నప్పటికీ ఉద్యోగి కోరితే మంజూరు చేయవచ్చును.
- ఉద్యోగి గైర్హాజరు అయిన కాలాన్ని డైస్ నాన్ లేదా అసాధారణ సెలవుగా పరిగణించవచ్చును.
- ఎ రకమైనా సెలవుతో కలిపినా గరిష్టంగా ఐదేళ్ళ వరకు ఉపయోగించుకొనవచ్చును
- క్షయ మరియు కుష్టు వ్యాధుల వైద్యం కొరకు 18 నెలల వరకు మంజూరు చేయవచ్చును
- కాన్సర్ మరియు మానసిక అనారోగ్యం కొరకు SC మరియు ST లకు శాఖాధిపతి 12 నెలల వరకు మంజూరు చేయవచ్చును.
- SC మరియు ST లకు చదువు కొరకు 24 నెలల వరకు శాఖాధిపతి మంజూరు చేయవచ్చును.
- వైద్య కారణాలపై మంజూరు చేయబడిన అసాధారణ లీవ్ కాలాన్ని ఇంక్రిమెంట్ కొరకు పరిగణిస్తూ శాఖాధిపతి అనుమతి ఇవ్వవచ్చును. ఆరు నెలల కంటే ఎక్కువ సమయానికి అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వగలదు.
31, జులై 2021, శనివారం
అసాధారణ సెలవు (EOL)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Superb website.very useful to employees.tq
రిప్లయితొలగించండిthank you
తొలగించండిఒక ఉద్యోగి ఒక ఇంక్రిమెంటు పొందిన తర్వాత 4 నెలలు పని చేసి తిరిగి ఒక సంవత్సరం పాటు EOL పొంది మరల 3 నెలలు పనిచేసి తిరిగి మరల 3 సంవత్సరాల పాటు EOL పొందినపుడు ఆ ఉద్యోగికి ఇంక్రిమెంట్లు ఏ విధంగా ఇవ్వాలి
రిప్లయితొలగించండిHi sir, I am village Surveyor from Prakasam dist... I'm applying EOL for Personal affairs (study perpose) through mpdo to AD survey dept ... But dist survey dept not approval and not sanction EOL ...
రిప్లయితొలగించండిhow got EOL sir ? Any suggestions