- భారత రాజ్యాంగం లోని 309 వ ఆర్టికల్ ద్వారా సంక్రమించిన అధికారాలతో ఈ నియమాలు రూపొందించ బడ్డాయి
- ఈ నిబంధనలు రాష్ట్ర సంచిత నిధి నుండి వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ వర్తిస్తాయి
- ప్రయాణ భత్యం: - ప్రజా సేవల కొరకు ఉద్యోగి చేసిన ప్రయాణ ఖర్చుల కొరకు చెల్లించే భత్యం
- రోజు:- ప్రధాన కార్య స్థానం లో 24 గంటల పాటు లేకపోతే ఒక రోజుగా పరిగణిస్తారు
- వేతనం: - ఫండమెంటల్ రూల్స్ లోని రూల్ 9 (21) (a) (i) లో చెప్పబడిన వేతనం
- పబ్లిక్ కన్వేయన్సు: - ప్రయాణీకుల రవాణా కోసం క్రమం తప్పకుండా నిర్వహించే రైలు లేదా ఇతర ప్రయాణ సాధనాలు
- బదిలీ: - విధులు నిర్వర్తించే ప్రధాన కార్యస్థానం లో మార్పు
- ప్రధాన కార్య స్థానం: రూల్ 22 లో చెప్పబడిన పని చేసే ప్రదేశం
- కుటుంబం: - భార్య లేదా భర్త, పిల్లలు, తల్లిదండ్రులు (ట్రాన్స్ఫర్ టూర్ అలవెన్సు కొరకు మాత్రమే)
- అధికారిక అవసరాల కోసం చేసే ప్రయాణాలు, బదిలీ సందర్భాలలో, లీవ్ ట్రావెల్ కన్సిషన్ సందర్భాలలో ప్రయాణ భత్యం పొందవచ్చు. FTA, టూర్ TA, ట్రాన్స్ఫర్ TA, LTC మొదలైనవి వివిధ రకాల ప్రయాణ భత్యాలు.
- ప్రతీ ప్రయాణ బత్యం క్లెయిమ్ నియంత్రణాధికారి కౌంటర్ సైన్ అయిన తరువాత మాత్రమే చెల్లింపులు చేయాలి.
- కార్యాలయ అధికారి నియంత్రణా అధికారి గా వ్యవహరిస్తారు. కార్యాలయ అధికారి కనుక నాన్ గజెటెడ్ అధికారి అయినట్లయితే తదుపరి గజెటెడ్ అధికారి నియంత్రణా అధికారి గా వ్యవహరిస్తారు. కార్యాలయ అధికారి ప్రయాణ భత్యం క్లైముల విషయంలో తదుపరి గజెటెడ్ అధికారి నియంత్రణా అధికారి గా వ్యవహరిస్తారు.
- శాఖాదిపతులు, హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి, ప్రభుత్వ న్యాయవాదులు, జిల్లా కలెక్టర్లు వారి ప్రయాణ భత్యం క్లైములు కౌంటర్ సైన్ చేయాల్సిన అవసరం లేదు.
- ప్రయాణం చేసే సమయానికి ఉన్న నిబంధనల ప్రకారం ప్రయాణ భత్యం క్లైములు అనుమతించ బడతాయి
- పదోన్నతులు, రివర్షన్ ల కారణం గా ఒకసారి సెటిల్ అయిన క్లైములను తిరిగి రివైజ్ చేయకూడదు.
- ప్రయాణ భత్యం క్లైముల కొరకు ఉద్యోగులను మూడు గ్రూపులుగా విభజించడం జరిగింది
- గ్రూప్ - I
- గ్రూప్ - II
- గ్రూప్ - III
- నిర్దేశిత ప్రదేశంలో, నిర్దేశించిన కాలం విధి నిర్వహణ కోసం ప్రయాణాలు చేసేవారికి ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్సు మంజూరు చేస్తారు. ఒకవేళ ఆ ప్రయాణాల కొరకు ప్రభుత్వం వాహనం వినియోగించి నట్లయితే 25 % తగ్గిస్తారు. ఒక ఉద్యొగి రెండు లేదా అంతకన్నా ఎక్కువ పోస్టులు నిర్వహిస్తున్నట్లయితే ఎన్నిటి కన్నా ఎక్కువ అలవేన్సు ఎ పోస్టు కి వస్తుందో అది క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనిని రెగ్యులర్ శాలరీ బిల్లుతో పాటు డ్రా చేసుకోవచ్చు.
14, ఏప్రిల్ 2021, బుధవారం
ఆంధ్ర ప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (ట్రావెలింగ్ అలవెన్సు) రూల్స్, 1996
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి