3, మే 2021, సోమవారం

జిల్లా కార్యాలయ నియమావళి

సాధారణ పరిపాలనా శాఖ జివో ఎంఎస్ నెం.1825, తేదీ. 26.12.1959 ద్వారా  అన్ని శాఖల కార్యాలయాల పాలనా వ్యవహారాల్లో టోటెన్ హామ్ విధానం గా పిలవ బడే ఈ మాన్యువల్ ని అమలు లో కి తీసుకు రావడం జరిగింది.

ప్రతీ ఉద్యోగి తన విధి నిర్వహణ కు చెందిన నియమ నిబంధనలు అన్నీ తెలుసుకుని ఉండాలి. ఈ విషయంలో అయినా జరిగిన పొరపాటుకు తెలియదనే కారణం అంగీకరించ బడదు.

హాజరు

  • ప్రతీ ఉద్యోగి అన్ని పనిదినములలో తప్పనిసరిగా ఉదయం 10:30 నుండి సాయత్రం ఐదు గంటల వరకు విధిగా కార్యాలయములో ఉండాలి.
  • కార్యాలయము నందలి ఉద్యోగులు  మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల లోపు ఒక అర్ధ గంట అందరూ ఒకేసారి కాకుండా వంతుల వారీగా భోజన విరామ సమయం కార్యాలయ ప్రాంగణం లోనే ఉపయోగించుకోవాలి.
  • ప్రతీ కార్యాలయం లో హాజరు పట్టిక తప్పనిసరిగా నిర్వహించాలి.
  • ప్రతీ ఉద్యోగి తప్పనిసరిగా ఉదయం 10:40 లోపు హాజరు పట్టిక లో సంతకం చేయాలి.
  • ఉదయం 10:40 తరువాత కార్యాలయానికి హాజరు అయితే అలస్యపు హాజరు పట్టికలో సంతకం చేయాలి. హాజరు పట్టికలో ఆలస్యం (లేట్) అని నమోదు చేయాలి.
    • ప్రతీ నెల రెండు సార్లు ముందస్తు అనుమతి తో ఒక గంట ఆలస్యంగా హాజరు కావచ్చును. ఒకేనెలలో మూడు సార్లు కన్నా ఎక్కువ ఆలస్యంగా హాజరు అయితే ఒక యాదృచ్చిక సెలవు తగ్గించబడును.
    • ప్రతీ మూడు రోజుల అలస్యపు హాజరునకు ఉద్యోగి యాదృచ్చిక సెలవు ఖాతా నుండి ఒక శెలవు తగ్గించాలి. ఉద్యోగి సెలవు ఖాతాలో తగిన యాదృచ్చిక సెలవులు లేనట్లయితే కాంపెన్సేటరీ సెలవుల నుండి లేదా తదుపరి సంవత్సర యాదృచ్చిక సెలవుల నుండి తగ్గించబడును.
      • ఉదయం 10:40 నుండి 11:30 మధ్యలో హాజరైన ప్రతీ మూడు సెలవులకు ఒక యాదృచ్చిక సెలవు తగ్గించ వలెను.
      • ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం రెండు గంటల లోపు హాజరు అయితే 1/2 యాదృచ్చిక సెలవు తగ్గించవలెను.
      • మధ్యాహ్నం రెండు తరువాత హాజరైతే పూర్తి యాదృచ్చిక సెలవు తగ్గించవలెను.
      • ఎవరైనా ఉద్యోగి ఆలస్యంగా హాజరు కావడం అనేది ఒక అలవాటుగా మారితే క్రమ శిక్షణా చర్యలు కూడా తీసుకోవచ్చును.
      •  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి