ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ కర్ఫ్యూ నిబంధనలు సడలించారు. అయితే రాష్ట్రం మొత్తం కాకుండా కరోనా పాజిటివిటీ రేటు ఆధారంగా సడలిపులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. కోవిడ్ పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న 8 జిల్లాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపు ఉండనుంది. రాత్రి 9 నుంచి 10 మధ్య దుకాణాలు, రెస్టారెంట్లు ఇతరత్రా మూసివేత కొనసాగుతుంది. రాత్రి 9 నుంచి ఉదయం 6 వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి