- ఎవరైనా ఉద్యోగి అత్యవసర పరిస్థితులలో విధులకు హాజరు కావాలని ఆదేశించడం లేదా టర్న్ డ్యూటీ లు చేయడం వల్ల పబ్లిక్ హాలిడే లేదా ఆప్షనల్ హాలిడే వినియోగించుకోలేక పొతే అతని సెలవు ఖాతా కు నష్ట పరిహారపు సెలవు జమ చేస్తారు.
- ఈ సెలవు ఆరు నెలల లోపు ఉపయోగించుకొనవచ్చును.
- గరిష్టంగా ఉద్యోగు సెలవు ఖాతాలో 7 నష్ట పరిహారపు సెలవులు నిల్వ ఉంటాయి.
- ఈ సెలవు ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు స్థానిక సంస్థల ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది.
- ఒక క్యాలండర్ సంవత్సరం లో గరిష్టంగా 10 నష్ట పరిహారపు సెలవులు వాడుకొనవచ్చును.
- ఈ సెలవు వినియోగించుకోవడానికి ముందస్తు మంజూరు తప్పనిసరి.
- CL, OH మరియు ఇతర సెలవులతో కలిపి వాడుకొనవచ్చును.
- సెలవు రోజున అధికారిక పర్యటనల లో ఉంటే నష్ట పరిహారపు సెలవు ఇవ్వబడదు.
4, జులై 2021, ఆదివారం
నష్ట పరిహారపు సెలవు (CCL)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి